తాగునీటి కోసం రోడెక్కిన మహిళలు
20-09-2026 | 01:51pm
మెదక్ -హైదరాబాద్ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా
కొల్చారం సెప్టెంబర్20: తాగునీటి కోసం మహిళలు మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. దీంతో పైపులైన్ కోసి మహిళలు రోడ్ ఎక్కా రు. గ్రామానికి సరఫరా చేసే పైప్లైన్ కోసి వేశారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఎస్ఐ(SI). మహమ్మద్ మైనుద్దీన్(Mohammed Mainuddin) సంఘటన స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడారు.సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.