ఆదర్శ యూత్ వినాయకుడి వద్ద కుంకుమ పూజలు

20-09-2026 | 03:58pm

రుద్రంగి సెప్టెంబర్ 20(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని ఆదర్శ యూత్ గణేష్ మండలి(Adarsh ​​Youth Ganesha temple) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా వినాయకుడి వద్ద మహిళలు ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం వినాయకుడిని ప్రతిష్టించి కుంకుమ పూజలు నిర్వహిస్తామన్నారు.ప్రతి రోజురాత్రి అలాగే నిమజ్జనం రోజుఅన్నదాన కార్యక్రమలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఆ గణనాథుడిఆశీస్సులు అందరిపై ఉండి వర్షాలు సకాలంలో కురిసిన పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్టు మహిళలు తెలిపారు.ఈ క్రాయక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు