సింగరేణిలో అంతర్గత అభ్యర్ధులకు వ్రాత పరీక్ష...
సింగరేణి మహిళా కళాశాలలో అభ్యర్థులకు పరీక్ష..
కొత్తగూడెం సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ(Singareni Collieries Company)లో ఖాళీగా ఉన్న ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-1 పోస్టులను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేయుటకు, ఆదివారము సింగరేణి మహిళా డిగ్రీ & పిజి కళాశాలలో వ్రాత పరీక్ష నిర్వహించారు.
ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-1 ‘96’ ఖాళీలకు గాను అర్హులయిన '84' మంది అభ్యర్ధులకు హాల్ టికెట్లు జారీ చేయగా '72' మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ వ్రాత పరీక్ష విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో, సిసి కెమెరాల నిఘా మధ్య నిర్వహించటం జరిగింది.
జిఎం(పర్సనల్) ఈఈ & ఆర్సి ఏ.జే.ఎం మురళీధర రావు జిఎం(విజిలెన్స్) ఎస్.వి.మురళీధర రాజు పర్యవేక్షించి, పరీక్ష పూర్తిగా మెరిట్ పై ఆధారపడి ఉంటుందని, దళారులను, నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు. పరీక్ష ఫలితాలు ఆదివారం రాత్రి, సింగరేణి వెబ్ సైట్లోను, సింగరేణి ప్రధాన కార్యాలయ ముఖద్వారం నోటీస్ బోర్డులో ప్రకటించబడును అనీ సింగరేణి అధికారులు తెలియజేశారు. ఈ పరీక్ష నిర్వహణలో పలువురు సింగరేణి అధికారులు, మహిళా కళాశాల ప్రిన్సిపల్, జి. మంజుల ఇతర అధికారులు, విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బంది, రిక్రూట్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.