ఓపెన్ డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు చేసుకోవాలి

27-09-2026 | 12:07am

నిర్మల్ సెప్టెంబర్ 26 ( విజయ క్రాంతి) : ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College), నిర్మల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ మరియు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Ambedkar Open University) స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ యు. గంగాధర్ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల(Applications) గడువు పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బి.ఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అర్హత గల విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. దూర విద్య ద్వారా కూడా ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కలదని, కావున ఆసక్తిగల విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9182568008 నంబరుకు గాని లేదా కళాశాల స్టడీ సెంటర్లో(College Study Centers) గాని  సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు