పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి
నేరేడుచర్ల సెప్టెంబర్ 12(విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం–1, 2 అంగన్వాడీ కేంద్రాల(Anganwadi centers)లో గురువారం ఏఎల్ఎంసీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఏడవ వార్డు కౌన్సిలర్ వాస జ్యోతి శేఖర్ హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ,పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజు పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మంచి ఆహారం తీసుకోవడం వల్ల తల్లి మరియు శిశువు ఆరోగ్యంగా ఉంటారని, పుట్టిన పిల్లలకు సమయానికి టీకాలు వేయించాలని తల్లులకు సూచించారు.
అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే మంచి పోషక విలువలతో కూడిన బాలామృతం అందిస్తున్నారని, అలాగే బరువు తక్కువగా ఉన్న పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక పోషకాహారం అందిస్తోందని. బాలింతలు ప్రతిరోజూ ఆరోగ్య లక్ష్మి కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి అంగన్వాడీ టీచర్ శాంతి, బిఎల్వో లు , గ్రామస్థులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.