30 June, 2026 | 6:50 PM

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి

30-06-2026 06:13 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ ఇంటి స్లాబ్ పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి యువకుడు మృతి చెందిన. సంఘటన టేకులబస్తీ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటన  వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాము(43) గత నాలుగు రోజుల క్రితం  బెల్లంపల్లికి రాము తన భార్య తో కలిసి అత్తగారి ఇంటికి వచ్చాడు. ఆయన పెద్ద బావమరిది మల్లెంపల్లి శంకర్ ఇందిరమ్మ ఇల్లు కు స్లాబ్ పోశాడు.

బావమరిది పాత ఇంట్లో నిద్రిస్తున్న రాము ఉక్కపోస్తుందని  అదేరోజు అర్ధ రాత్రి  టేకులబస్తిలో కొత్త ఇల్లు స్లాబ్ పై పడుకోవడాని కి వెళ్ళాడు. మూత్ర విసర్జన కోసం నిద్రలేచినా ఆయన  ప్రమాద వశాత్తు స్లాబ్ పైనుంచి కిందపడ్డాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడి  రాము అక్కడిక్కడే  మృతి చేశాడు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి వన్ టౌన్ సీ ఐ శ్రీనివాసరావు సందర్శించారు. మృతుని భార్య మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.