బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
27-02-2026 02:04 PM
హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్(Botcha Satyanarayana) వచ్చింది. దీంతో బొత్స సత్యనారాయణను హైదరాబాద్ కు తరలించారు. నగరంలోని సిటీ న్యూరో సెంటర్(City Neuro Center)లో ఆయనకు చికిత్స కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. బొత్స సత్యనారాయణ నిన్న రాత్రి సిటీ ఆస్పత్రిలో చేరారు. బొత్స సత్యనారాయణకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు సూచించారు. బొత్సను రెండురోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశముందని డాక్టర్లు పేర్కొన్నారు.




