సమ్మె ఎఫెక్ట్.. ఆదివారం బ్యాంకులు ఓపెన్!

23-09-2026 | 01:21pm

ఖాతాదారులకు సేవల్లో అంతరాయం లేకుండా ఆర్‌బీఐ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న లావాదేవీలను పూర్తి చేయడంతో పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నాయి.ఈ మేరకు ఆర్‌బీఐ (RBI) బుధవారం ప్రకటన విడుదల చేసింది. సమ్మె కారణంగా నిలిచిపోయే అవకాశం ఉన్న లావాదేవీలు, చెల్లింపులు, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేసేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రభావం ఖాతాదారులపై పడకుండా సేవలను సాధ్యమైనంత సజావుగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

మరిన్ని వార్తలు