ఏబీవీపీ విద్యార్థుల అరnirస్టు
12-09-2026 | 04:55pm
నిర్మల్ సెప్టెంబర్ 12 ( విజయ క్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(All India Students' Council) రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థులను శనివారం నిర్మల్ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. పొద్దున 4:00 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)అక్రమ అరెస్ట్ చేసి నిర్మల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లడాన్ని ఎబివిపి తీవ్రంగ ఖండిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న ఎబివిపి నాయకులను అక్రమ అరెస్టులతో అడ్డుకోలేరని, విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఎబివిపి నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో దినేష్ రాకేష్ రాజు పాల్గొన్నారు.