కన్న ఊరి పై మమకారం
16-09-2026 | 06:32pm
రూ.3.70 లక్షల సాయం
నిర్మల్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): పుట్టిన ఊరు పై మమకారం చూపెట్టారు. గ్రామానికి చెందిన తుర్తి సుధాకర్ బుధవారం స్వర్గలోక రథానికి రూ.2,20 లక్షలు, దుర్గామాత షెడ్డు కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందించారు. గ్రామ సర్పంచ్ రమేష్(Village Sarpanch Ramesh)కు ఈ ఆర్థిక సాయం అందించి సేవలను ప్రారంభించాలని సూచించారు.
గ్రామంలో ఎవరైనా మరణిస్తే స్వర్గరథం లేకపోవడంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సాయం అందించినట్లు తెలిపారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సభ్యులకు సాయం అందించిన సుధాకర్ కు గ్రామ సర్పంచ్ ఎం రమేష్ వాడు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, యూత్ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు