దుర్గామాత ముందు నిరసన
భైంసా,(విజయక్రాంతి): యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేవైఎం ఆధ్వర్యంలో దుర్గామాత ముందు నిరసన తెలిపారు. యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన రూ.4 4000 చెల్లించాలని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు కొండ సాయి ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిందే గంగాప్రసాద్, నాయకులు గణేష్, విష్ణు, ఓబీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.