మద్యం మత్తులో ఇంటికి నిప్పు

29-09-2026 | 06:06pm

నిర్మల్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో మద్యం మత్తులో ఓ యువకుడు ఇంటికి నిప్పు పెట్టారు. తండ్రి, కుమారుడి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కుమారుడు ఊట్ల రఘు మంగళవారం ఉదయం ఇంటికి నిప్పుపెట్టాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది.

గ్రామస్తులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు