ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఖుర్షీద్ పాషాకు ఘన సన్మానం
29-09-2026 | 06:28pm
ఆలేరు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఖుర్షీద్ పాషాను మంగళవారం ఆలేరులో మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో ఆయన అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ కోరుకోప్పుల కిష్టయ్య, కొల్లూరు ఉపసర్పంచ్ గాజుల దశరథ, శర్భనాపురం మాజీ సర్పంచ్ సీత శ్రీహరి, గడ్డమీది నరేష్, ఆలేరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కోరుటూరి ఉపేందర్, గుండు మహేందర్, కూళ్ల సిద్ధులు, సందెన శంకర్ తదితరులు పాల్గొన్నారు.