గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

18-10-2026 | 07:10pm

మునిపల్లి అక్టోబర్ 18: ( విజయక్రాంతి ): బతుకమ్మ పండగ(Bathukamma Festival) సందర్భంగా ఆదివారం నాడు మండల కేంద్రమైన మునిపల్లితో పాటు ఖమ్మంపల్లి(Khammanpalli), అల్లాపూర్, చీలపల్లి, మల్లికార్జున్ పల్లి తదితర గ్రామాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  బతుకమ్మలను మహిళలు అందంగా పేర్చి గ్రామ పురవీధుల గుండా డప్పు చప్పుడు, ఆటపాటలతో మధ్య బతుకమ్మలను సమీప చెరువుల వద్ద నిమజ్జనాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు , పాండు, అంకెన్ పల్లి నారాయణ, పట్లోళ్ల లక్ష్మీ వీరన్న పాటిల్ తదితరులు పాల్గొని  ప్రజలందరూ సుభిక్షంగా, సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తక్కడపల్లి సంఘన్న, అంజయ్య గౌడ్, అంకలి శేఖర్, రాజు, ఫెరోజ్ఖాన్,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు