దుర్గాదేవి అలంకారంలో పర్వత వర్ధిని అమ్మవారు
భక్తులతో కిటకిటలాడిన యాదగిరి కొండ
నిత్య రాబడి...23,14,282/-
యాదగిరిగుట్ట, అక్టోబర్ 18 (విజయకాంతి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా ఆదివారం దుర్గాదేవి అమ్మ వారిగా భక్తులకు(devotees) దర్శనం ఇచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం దుర్గాష్టమి సందర్భంగా ఆలయ పూజారులు మరియు వేద పండితులు విశేష పూజల నడుమ చండీహవనము శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిత్య పూజలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం అర్చకులు శాస్త్రృక్తంగా పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి నిత్య రాబడి 23,14,282/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.