పోయిరావే గౌరమ్మ
చందుర్తి,అక్టోబర్ 18,(విజయక్రాంతి) : చందుర్తి మండల(Chandurthi Mandal) కేంద్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ(Bathukamma Festival) పూర్తిగా ప్రకృతితో ముడిపడి ఉన్న ఉత్సవం. మహిళలు అడవుల నుండి, పొలాల నుండి తంగేడు, గునుగు, చామంతి, బంతి, గుమ్మడి వంటి రంగురంగుల పూలను సేకరిస్తారు, గోపురం ఆకారంలో (శిఖరంలా) అద్భుతంగా పేరుస్తారు. దానిపై పసుపుతో చేసిన 'గౌరమ్మ'ను ఉంచి పూజిస్తారు.
ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగుతుంది. ప్రతి రోజు ఒక ప్రత్యేక పేరుతో బతుకమ్మను పేరుస్తూ, ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు.అందులో భాగంగా చందుర్తి మండల కేంద్రంలో గచ్చుబావి ఆవరణలో బతుకమ్మ సంబరాలను కొలాటాలతో మహిళలు అనందోత్సాహలతో ఘనంగా జరుపుకున్నారు.నాయకులు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఏర్పాట్లను చేశారు.