ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

03-10-2026 | 06:17pm

భైంసా, ( విజయక్రాంతి) : మహిళలు వృత్తి నైపుణ్యం(Womens Professional Skills) పెంపొందించుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(Pawar Ramarao Patel) గారు అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ(Sri Shirdi Sai Seva Society) ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ(Vocational Skills Training) పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో యువతులకు వృత్తి నైపుణ్యం ఎంతో అవసరమని అన్నారు. ఒక నైపుణ్యాన్ని నేర్చుకుంటే ఎక్కడైనా ఉపాధి పొందడంతో పాటు స్వయం ఉపాధి ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవచ్చని తెలిపారు.

యువతులు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి అందించే కుట్టు మిషన్లు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యువతులకు ఉపాధి కల్పించే దిశగా వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, ఎస్ ఆర్ టి, ఆర్ ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, మహిళలు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు