బతుకమ్మ వేడుకలు

10-10-2026 | 05:35pm

నిర్మల్ అక్టోబర్ 11 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని నటరాజ్ నగర్ బచ్పన్ ప్లే స్కూల్ సంస్కార్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను తయారుచేసి పూజలు నిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలను నిర్వహించారు. అనంతరం బతుకమ్మను ర్యాలీతో తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అయ్యన్న గారి రచన, డైరెక్టర్ అయ్యన్న గారి శ్రీధర్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు