క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం
నిర్మల్,(విజయక్రాంతి): క్షయ వ్యాధి(Tuberculosis)ని సమూలంగా నిర్మూలించేందుకు ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం(Mukt Bharat Abhiyan program) నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్(District Medical Health Officer Dr. Rajender) తెలిపారు. బుధవారం డిఆర్ఓ రమేష్ రాథోడ్(DRO Ramesh Rathod)తో కలిసి సమావేశం నిర్వహించారు. డా. రాజేందర్ మాట్లాడుతూ.. నిక్షయ్ మిత్రల ద్వారా టీబీ రోగులకు పోషకాహారం, సామాజిక సహకారం అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలను భాగస్వాములను చేయాలని సూచించారు.
టీబీపై ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. టీబీ లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించేలా ప్రజలను చైతన్యపరచాలని అధికారులు సూచించారు. కుటుంబ సభ్యులు, సమాజం అండగా నిలిచి టీబీ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.