ఎస్సీ విభాగం చైర్మన్‌గా కత్తి నరేందర్

29-09-2026 | 06:59pm

నిర్మల్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌కు చెందిన కౌన్సిలర్ కత్తి నరేందర్ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ(Nirmal constituency) ఎస్సీ విభాగం చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ కట్ట శ్యామ్ మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు