ఎంబిబిఎస్ విద్యార్థికి సన్మానం

18-10-2026 | 04:34pm

నిర్మల్ అక్టోబర్ 18 ( విజయ క్రాంతి) : తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్(Telangana Muslim Employees Association) ఆధ్వర్యంలో ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు(Students) సన్మానం చేశారు. ఆదివారం సంఘ భవనంలో 30 మంది విద్యార్థులకు(Students') సన్మానం చేశారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ అర్జున్ అలీ(Arjun Ali) మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా రాణించాలని సూచించారు. దైవం తర్వాత అందరూ పూజించేది వైద్యులనే అని, అలాంటి రంగం ఎంచుకున్న విద్యార్థులంతా సేవే పరమావధిగా ముందుకు సాగాలని చెప్పారు.

ఎంబీబీఎస్ డిగ్రీ(MBBS degree) అనంతరం పీజీ లోనూ స్థానం సాధించి పూర్తిస్థాయి నిష్ణాతులైన వైద్యుడిగా(Doctor's) ఎదగాలని ఆకాంక్షించారు. మన వాళ్ల తల్లిదండ్రులకు, మన ఊరికి మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు యం. ఏ. మతీన్, వహీద్ ఖాన్, మొహమ్మద్ ఇంతియాజ్, అబ్దుల్ సాజిద్, ముజాహిద్ మొహియుద్దీన్, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు