పివిఆర్ భవన్ లో సంబరాలు

16-09-2026 | 08:30pm

ఆర్మూర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, ఏ.ఎం.సి. చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు, కౌన్సిలర్లు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను విజయవంతంగా అమలు చేస్తుందని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. అదేవిధంగా రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ  ఉపాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు భూపేందర్, నర్మే నవీన్, బొప్పెన ప్రసాద్, కొడిగెల మల్లయ్య, నాయకులు గోనే దామోదర్, శాల ప్రసాద్, గంగూలీ, సుమన్, తిరుమల సుమన్, పండిత్ పవన్, ఖందేశ్ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు కలిగోట్ శ్రీనివాస్, సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ సభ్యులు జిమ్మి రవి, చరణ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు