అక్రమ ఇసుక నిల్వలు తొలగించాలి

16-09-2026 | 09:34pm

గ్రామపంచాయతీ తీర్మానం మేరకు చర్యలు

పశువుల సంత స్థలాన్ని ఖాళీ చేయాలని సూచన

ఇసుక నిల్వ చేస్తే చర్యలు తప్పవని డీఎల్‌పీవో సురేందర్ హెచ్చరిక

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్‌పేట గ్రామపంచాయతీ(gopalpet gram panchayat) పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను వెంటనే తొలగించాలని డీఎల్‌పీవో బి.సురేందర్‌ ఆదేశించారు. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు పంచాయతీ కార్యదర్శి సలీం ఆధ్వర్యంలో ఇసుక నిల్వ చేసిన స్థలాన్ని పరిశీలించి, ఆ స్థలాన్ని గ్రామపంచాయతీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీకి సంబంధించిన పశువుల సంత స్థలంలో కొంతమంది అక్రమంగా ఇసుకను నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ విషయంపై గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఇసుక నిల్వలను వెంటనే తొలగించాలని ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్‌(DLPO B. Surender) హెచ్చరించారు. పంచాయతీ స్థలాలను అనధికారికంగా వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్, గ్రామ సర్పంచ్‌ రాఘవపల్లి వంశీకృష్ణ గౌడ్‌, ఉపసర్పంచ్‌ గులాం హుస్సేన్, గ్రామపంచాయతీ కార్యదర్శి సలీం, పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు