బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం

11-10-2026 | 07:12pm

స్తుల్తనాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ లో ఆదివారం దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి(Bala Tripura Sundari) దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు.

అమ్మవారి ఆశీస్సులతో  ప్రజలు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ ఆకాంక్షించారు.తొలిరోజు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాలతో పట్టణంలో, గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. సుల్తానాబాద్ వాసవి మాత దేవాలయంలో దుర్గామాత అమ్మవారిని కొమురవెల్లి సుజాత అంజయ్య , అన్వేష్ మౌనిక  దంపతులు ఏర్పాటు చేశారు,  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మొదటిరోజు వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండువగ జరిగాయి... భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు....

మరిన్ని వార్తలు