డాక్టరేట్ పట్టా అందుకున్న కుందన్ కౌర్

08-09-2026 | 07:59pm

ముకరంపుర,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గర్రేపల్లి మోడల్ పాఠశాల(Garrepalli Model School)లో భౌతిక శాస్త్ర పిజిటి గా పని చేస్తున్న కుందన్ కౌర్ మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University) నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఓయూసిడబ్ల్యూకు చెందిన భౌతిక శాస్త్ర విభాగం డా.నరేంద్రబాబు  మార్గదర్శకత్వంలో 'డిజైన్, సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ న్యూ కోర్ షెల్ నానోమెటీరియల్స్ ఫోర్ ఫోటోకాటలిసిస్ అప్లికేషన్స్' అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పరిశోధనకు సహకరించిన పర్యవేక్షకులు నరేంద్ర బాబు ఓ.యూ.సి.డబ్ల్యూ మరియు రసాయన శాస్త్ర విభాగం, ఓ.యూ కి చెందిన డా.సోమేశ్వర్ కు  హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు