ప్రజలందరికీ శ్రీ వేణుగోపాల స్వామి కృపాకటాక్షాలు కలగాలి

21-10-2026 | 06:21pm

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, అక్టోబర్ 21 విజయక్రాంతి : శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి(Sri Santana Venugopala Swamy) దేవుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(Chintakunta Vijaya Ramana Rao) వేడుకోవడం జరిగిందన్నారు... విజయదశమి వేడుకల్లో(Vijayadashami Celebration) భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి చెరువు వరకు రథయాత్ర కొనసాగింది, జమ్మి పూజ కొరకు ఏర్పాటు చేసిన రథయాత్రలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు.

చైర్మన్ పల్ల మురళీధర్ ఆధ్వర్యంలో అర్చకులు సౌమిత్రి వేణు , శ్రావణ్ కుమార్ లు ఎమ్మెల్యే చే ప్రత్యేక పూజలు చేయించారు... అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , ప్రజా ప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....

మరిన్ని వార్తలు