గణేశుడికి లక్ష గరిక, లక్ష ఉండ్రాలతో ప్రత్యేక పూజలు

16-09-2026 | 06:39pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల  శ్రీ శివాలయంలో బుధవారం గణేశుడు వద్ద  దంపతులు రవ్వ సతీష్ శ్రీదేవి, కాసం అశోక్ వెంకట్ లక్ష్మి, అల్లెంకి శ్రీనివాస్ లావణ్య దంపతులు  ప్రత్యేక పూజలు చేశారు. ఆది దేవుడైన గణేశుడికి లక్ష గరిక, లక్ష ఉండ్రాళ్ళు, బియ్యం, చక్కెర తో ప్రత్యేక పూజలు జరిపారు. చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  అర్చకులు వల్లకొండ మఠం రమేష్, మహేష్ లు దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు