విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి
జిల్లా విద్యాశాఖ అధికారి శారద
సుల్తానాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలకు పుట్టినిల్లు సుల్తానాబాద్ అని పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి శారద(District Educational Officer Sharada), సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలతలు అన్నారు.
సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్ జి ఎఫ్ జోనల్ స్థాయి వాలీబాల్ , కోకో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీలను జిల్లా విద్యాధికారి శారద, సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత లు ప్రారంభించారు. ఈ క్రీడలు సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో అండర్ 14 , 17 బాలురు, బాలికలు పాల్గొన్నారు, ఇందులో పెద్దపల్లి, మంథని, రామగుండం, సుల్తానాబాద్ జోన్ల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో స్పోర్ట్స్ క్లబ్బు అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ లక్ష్మణ్, నోడల్ అధికారి శోభా, జోనల్ సెక్రెటరీ దాసరి రమేష్, పేట అధ్యక్షులు సురేందర్, మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య, సీనియర్ క్రీడాకారులు అమీరీ శెట్టి తిరుపతి, కుమార్ కిషోర్, భైరగోని రవీందర్ గౌడ్, గెల్లు మధుకర్,షఫీ, ప్రణయ్, కొమర శ్రీనివాస్, బొల్లి సత్యం, ఎండి ముస్తఫా తో పాటు పీఈటీలు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.