ప్రజావాణికి ఆదరణ కరువు..!
02-11-2026 | 03:04pm
ఫిర్యాదుదారులు లేక వెలవెలబోయిన కార్యక్రమం
గంభీరావుపేట,(విజయక్రాంతి): మండల ప్రజా పరిషత్ కార్యాలయం(Gambhirraopet Mandal Parishad office)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి(Prajavani Program) స్పందన కరువైంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఫిర్యాదుదారులు నామమాత్రంగానే హాజరయ్యారు. హౌసింగ్ ఏఈకి ఒకటి, ఆర్ అండ్ బీకి ఒకటి, విద్యుత్ శాఖకు నాలుగు ఫిర్యాదులు అందాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రజావాణి 11:30 గంటలకే ఫిర్యాదుదారులు లేక వెలవెలబోయింది.