ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

20-11-2026 | 02:34pm

కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

కోనరావుపేట,(విజయక్రాంతి): ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమం(Praja Palana–Pragathi Bata Program)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) శుక్రవారం కోనరావుపేట మండల కేంద్రంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మస్కూరి కాశీరం మాట్లాడుతూ... కుటుంబాన్ని పోషించే పెద్ద వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రమాదాలు, అనుకోని సంఘటనల సమయంలో కుటుంబాలకు ఈ బీమా పథకం ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జింక రేవతి కరుణాకర్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మందాల లింగయ్య, మేకల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముదాం ప్రదీప్, కాంగ్రెస్ నాయకులు చందనగిరి గోపాల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు