కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా చోరీ
బంగారు, వెండి ఆభరణాలు నగదు అపహరణ
చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని జోగాపూర్ గ్రామం(Jogapur Village)లో ముత్యాల సంతోష్ ఇంట్లో అర్దరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు కుటుంబ సభ్యులు గాడ నిద్రలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనక నుండి చొరబడి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనలో ఏడు తులాల బంగారం, ఎనబై వేల రూపాయల నగదు,4 తులాల పట్ట గొలుసులు ఎత్తుకెళ్లారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణుల బృందం ఆధారాలను సేకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.