"కెవిపిఎల్ వాలీబాల్: కోనరావుపేట విజేత"

18-10-2026 | 07:32pm

కోనరావుపేట అక్టోబర్ 18(విజయక్రాంతి): కోనరావుపేట మండలం(Konaraopeta Mandal) సుద్దాల గ్రామంలో సుద్దాల సర్పంచి కుంటెల్లి నాగరాజు(Kuntelli Nagaraju) తాత కుంటెల్లి రాజమల్లయ్య జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్(Volleyball Tournament) నిర్వహించిన కెవిపిఎల్ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో కోనరావుపేట జట్టు ప్రథమ స్థానం(First place) సాధించి సత్తా చాటింది. ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన కోనరావుపేట జట్టు విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా విజయం సాధించిన కోనరావుపేట జట్టు క్రీడాకారులను, టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.క్రీడాకారులు భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో  చీటీనేని శివతేజ క్రీడాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు