అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన
ములుగు, నవంబర్ 23 (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో 5 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్ అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. చేపట్టనున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, మున్సిపల్ కమిషనర్ సంపత్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.