ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

13-09-2026 | 12:26am

మండప నిర్వాహకులకు సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి సూచనలు

గంభీరావుపేట,(విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలను(Ganpati Navratri celebrations) ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి(Sircilla DSP Nagendra Chari) సూచించారు. ఎల్లారెడ్డిపేట సీఐ ఓదెల వెంకటేష్, ఎస్సై శ్రీకాంత్‌లతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) గంభీరావుపేట మండల కేంద్రంలోని రెడ్డి సంఘంలో గణపతి మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు.

మండపాల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, భక్తులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

గణపతి నిమజ్జనం సమయంలోనూ పోలీసుల మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలని కోరారు. ఉత్సవాలు విజయవంతంగా, ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల గణపతి మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు