ఆకుపచ్చని తోరణంతో నర్మాలకు స్వాగతం

21-09-2026 | 03:05pm

గంభీరావుపేట, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట(Gambhiraopet) మండలం నర్మాల-గంభీరావుపేట రహదారి పచ్చదనంతో కనువిందు చేస్తోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గతంలో నాటిన మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా పెరిగి రహదారికి ఇరువైపులా ఆకుపచ్చని తోరణంలా మారాయి.

ఈ వృక్షాలు ప్రయాణికులకు చల్లటి నీడనిచ్చి, ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులకు ఆహ్లాదకరమైన ప్రయాణానుభూతిని కలిగిస్తున్నాయి. వానలైనా, ఎండలైనా ఈ దారి వెంట సాగేవారికి సేదతీరే వాతావరణం అందిస్తోంది.నర్మాల నుంచి గంభీరావుపేట వరకు విస్తరించిన ఈ పచ్చదనం గ్రామంలోకి వచ్చే వారికి సహజసిద్ధమైన స్వాగత ద్వారంలా నిలిచి అందరినీ ఆకట్టుకుంటోంది.


మరిన్ని వార్తలు