అరాచకవాదాన్ని అంతం చేయాలి

02-11-2026 | 10:55pm

మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, లచ్చిరెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 2 : ప్రజాస్వామ్యాన్ని రక్షించి అరాచకవాదాన్ని అంతం చేద్దామని హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్లు కళ్ళెం నవజీవన్ రెడ్డి, లచ్చిరెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ముఖ్య అతిథిగా పాల్గొన్న మహా పాదయాత్రకు సంఘీభావంగా బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా హక్కుల సాధన, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ నిర్వహించిన ఈ మహా పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావాన్ని చాటుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల గొంతుకగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుదామని కోరారు.

మరిన్ని వార్తలు