బాలుడు అదృశ్యం
28-09-2026 | 11:17pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఓ బాలుడు అదృష్టమైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ ఫర్హాన్ (13) ఘట్ కేసర్ బాలాజీ నగర్‌లోని మొహమ్మదీయ మసీదులో ఉంటూ ఖురాన్, ఉర్దూ నేర్చుకుంటున్నాడు.
ఈనెల 27న ఉదయం సుమారు 7గంటలకు మసీదు నుండి వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు సుమారు 4 అడుగులు, తెలుపు-నలుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంట్, హిందీ, బెంగాలీ భాషలు మాట్లాడతాడని, బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.