వైభవంగా కార్తీక పౌర్ణమి

24-11-2026 | 08:48pm

ఘట్ కేసర్, నవంబర్ 24 (విజయక్రాంతి) : కార్తీక పౌర్ణమి వేడుకలను(Kartik Purnima celebrations) ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంత ప్రజలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు భారీ తరలివచ్చి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.

ఆలయాల సన్నిధానంలో, ఇంటి ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. పలు ఆలయాలలో భక్తులు శివపార్వతులకు అభిషేకాలు చేశారు.

లక్ష దీపోత్సవం

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల్ విద్యా సంస్థల క్రీడా మైదానంలో మంగళవారం సాయంత్రం జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు,

మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొని దీపాలను వెలిగించారు. సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు.

మరిన్ని వార్తలు