సర్వీస్ నుంచి హోంగార్డు తొలగింపు
మహిళపై దాష్టీకం కేసులో వేటు
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 19(విజయక్రాంతి): హఫీజ్పేట్ రైల్వే స్టేషన్(Hafeezpet Railway Station) సమీపంలో శుక్రవారం రాత్రి తెలంగాణ పోలీస్ హోం గార్డు(Telangana Police Home Guard) ఆనంద్(Anand) ఒక మహిళపై విచక్షణారహితంగా దాడి(Indiscriminate attack on a woman) చేసి జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చిన ఘటన వీడియో వైరల్(Video goes viral) కావడంతో నగరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు డిప్యూటేష్ప విధులు నిర్వహిస్తున్న ఆయనను మియాపూర్ పోలీసులు గుర్తించి కేసు నమోదు(Case registered) చేసి అరెస్టు చేశారు.
సైబరాబాద్ సీపీ ఏం.రమేష్ ఆనం ద్ను సర్వీస్ నుంచి తొలగించి కోర్టుకు హాజరుపరుస్తామని ప్రకటించగా, డీజీపీ సీవీ ఆ నంద్ ఈ ప్రవర్తనను క్షమించరానిదని ఖం డించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే అతడిని తెలంగాణ పోలీస్ శాఖకు తిరిగి పంపించింది. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ పోలీసుల ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు.