విద్యుత్ అధికలోడ్ సమస్యలను పరిష్కరిస్తాం
ఎస్ఈ లక్ష్మీనారాయణ, డీఈ ఆపరేషన్ ఫర్హాత్ అలీ
ఎల్బీనగర్, అక్టోబర్ 4 : సరూర్ నగర్ టీజీఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్(Saroornagar TGSPDCL Operations) పరిధిలో విద్యుత్ సరఫరాలో(Power supply) వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని, ఇందుకోసం విద్యుత్ సబ్ స్టేషన్ల(Electrical substations) సామార్థ్యాన్ని పెంచుతున్నట్లు ఎస్ఈ లక్ష్మీనారాయణ, డీఈ ఆపరేషన్ ఫర్హాత్ అలీ తెలిపారు. ఆదివారం హయత్ నగర్ డివిజన్ లోని మదర్ డెయిరీ సమీపంలో ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 16ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీ కరెంట్ బిల్లులను సకాలంలో చెల్లించి, మెరుగైన సేవలను అందించడానికి విద్యుత్ శాఖకు సహకరించాలన్నారు. ఏడాది పొడవునా మెరుగైన విద్యుత్ సేవలు అందించడానికి ప్రతి ఉద్యోగి, సిబ్బంది కృషి చేస్తున్నట్లు తెలిపారు. సరూర్‌నగర్ సర్కిల్‌లోని హయత్ నగర్ సెక్షన్‌లో ప్రారంభించబడిన మొట్టమొదటి 16 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఇదేనన్నారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచడంతో సరూర్‌నగర్ సర్కిల్‌లో విద్యుత్ సరఫరా యొక్క విశ్వసనీయత, నాణ్యత మరింతగా మెరుగు పడుతుందన్నారు.
పెరిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం వోల్టేజ్ ప్రొఫైల్ సమస్య, విద్యుత్ సరఫరా పెరుగుతుందని తెలిపారు. విజయనగర్ కాలనీ ఫీడర్, శివం హిల్స్ ఫీడర్, వీరభద్ర నగర్ ఫీడర్, ప్యారడైజ్ విల్లాస్ ఫీడర్, శివ పార్వతి జంక్షన్ నుంచి పెద్దంబర్‌పేట సెక్షన్ వరకు విద్యుత్ సరఫరా పెరుగుతుందన్నారు.
దీంతో పాటు హయత్ నగర్ డివిజన్ లోని సుబ్రమణ్యం కాలనీ, వీరభద్ర నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, సూర్య నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, శుభోదయ నగర్ కాలనీ, శివం హిల్స్ ప్రియదర్శని కాలనీ, ప్రగతి నగర్, నాగార్జున కాలనీ, వీరభద్ర నగర్, విష్ణు నగర్, రాజారాజేశ్వరి కాలనీ, శ్రీ కృష్ణ హిల్స్, ఎల్లారెడ్డి కాలనీ, విజయనగర్, బృందావన్ కాలనీ, లింగమయ్య వెంచర్, ఆర్టీసీ కాలనీ, సాయిగణపతి కాలనీ, వినాయక నగర్, శివ పార్వతి నగర్, కొండలూరు రోడ్ విద్యుత్ సరఫరా సమస్యలు తీరుతాయని ఎస్ఈ లక్ష్మీనారాయణ, డీఈ ఆపరేషన్ ఫర్హాత్ అలీ తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.