ఎంపీ ఈటల పాదయాత్రలో
ఎల్బీనగర్ నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు
ఎల్బీనగర్, అక్టోబర్ 27: జవహర్ నగర్ డంపింగ్ యార్డు కారణంగా కాలుష్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్(MP Etela Rajender) చేపట్టిన పాదయాత్రలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీజేపీ మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
గడ్డి అన్నారం, కొత్తపేట, చైతన్యపురి, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్, రంగా నర్సింహగుప్తా, లచ్చిరెడ్డి, నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి, బీజేపీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.