లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయాలి

27-10-2026 | 08:58pm

- పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ 

- విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో అవగాహన సదస్సు 

ఎల్బీనగర్, అక్టోబర్ ‌27: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్(Judge Srinivas) ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులకు బాలల రక్షణ, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో -2012), బాలల హక్కులు, లైంగిక వేధింపుల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.

బాలల భద్రత కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చి లైంగిక వేధింపులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.

డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ సీహెచ్ రవి విద్యార్థులకు గుడ్ టచ్- బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. లైంగిక వేధింపులను ఎలా గుర్తించాలి?, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరికి తెలియజేయాలి?, తమను తాము ఎలా రక్షించుకోవాలి?, అనే అంశాలను వివరించారు. మానసిక ఆరోగ్యం, భావోద్వేగ నియంత్రణ, ఒత్తిడిని అధిగమించే అంశాలపై సైకియాట్రిస్ట్ అనిత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్ కే పాషా, వైస్ ప్రిన్సిపాల్ శివ ప్రసాద్, పారా లీగల్ వలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు