బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

27-10-2026 | 09:00pm

- రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు 

- హైకోర్టు కాలనీలో బీజేపీ కార్యాలయం ప్రారంభం 

ఎల్బీనగర్, అక్టోబర్ 27: ప్రతి నాయకుడు, కార్యకర్త బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(BJP President Ramachander Rao) పిలుపునిచ్చారు. హయత్ నగర్ డివిజన్ నుంచి నూతనంగా ఏర్పడిన హైకోర్టు కాలనీ డివిజన్‌లో మంగళవారం బీజేపీ కార్యాలయాన్ని మంగళవారం బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైకోర్టు కాలనీ డివిజన్‌లో బీజేపీ కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం  పార్టీ కార్యాలయం ఒక వేదికగా నిలుస్తుందన్నారు . సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించేలా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ ఇన్ చార్జి సామ రంగా రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు