రైతుల గుర్తింపు ఇంకా లెక్కింపులోనే!
- ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్
- ఇప్పటివరకు 75 శాతమే ఎన్రోల్మెంట్
- వచ్చే ఏడాది తప్పనిసరి కానున్న ఫార్మర్ ఐడీ కార్డు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలకు అర్హులు
- మరింత అవగాహన అవసరమంటున్న రైతు సంఘాలు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో సాగుభూమి 1.45 కోట్ల ఎకరాల వరకు విస్తరించి ఉండగా, రాష్ట్ర జనాభాలో దాదాపు 55 శాతం వరకు వ్యవసాయంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులు 85 శాతం వరకు ఉన్నారు.
అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సుమారు గా 72 లక్షల మంది కర్షకులకు రైతు భరో సా అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే సంక్షేమం, ఇతరత్రా రాయితీలు అందించేందుకు వారి గుర్తింపు కోసం ‘ఫార్మర్ ఐడీ(Farmer ID)’ కార్డును త ప్పనిసరి చేశాయి. ఆధార్ తరహాలో 11 అంకెల సంఖ్యను కేటాయిస్తా రు. దీనికి పట్టా పుస్తకాలు, ఆధార్, లింక్ అయిన ఫోన్ నంబర్ అవసరం ఉంటుంది. పీఎం కిసాన్, సబ్సిడీలు, రు ణాలు పొందడానికి అర్హులుగా ఉంటారు. ఏఈవోలు ఈ ఫార్మర్ ఐడీని నమోదు చేస్తున్నారు.
అయితే ఈ కార్యక్రమం ఏడాదిన్న రగా కొనసాగుతూనే ఉంది. 2025 ఏప్రిల్ నుంచే ప్రారంభమైనా ప్రక్రియ మాత్రం నేటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. ఫార్మ ర్ ఐడీ నమోదులో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందువరసలో ఉందని అధికారులు చెబుతున్నా రాష్ట్రంలో ఇప్పటివరకు 75 శాతం వరకే పూర్తయినట్లు సమాచారం. గ్రామాల్లోని రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నా వివరాల నమోదుకు రైతులు ఆసక్తి చూపడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏఈవోలే రైతులకు ఫోన్లు చేసి ఫార్మర్ ఐడీని నమోదు చేస్తున్నట్లుగా ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రైతుల భవిష్యత్తుకు భద్రత
ఈ విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య(ఫార్మర్ ఐడీ) ద్వారా రైతులు భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అన్ని వ్యవసాయ పథకాల్లో లబ్ధి పొందవచ్చు. ప్రధా నంగా వచ్చే ఏడాది నుంచి రైతులకు ఈ కార్డు తప్పనిసరి కానుంది. ఈ సంఖ్య భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు, విత్తన పంపిణీ, రుణ సాయం వంటి పథకాలన్నింటికీ కీలక ఆధారంగా ఉపయోగపడు తుంది. కాబట్టి, రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, పాసుబుక్లో ఉన్న వివరాలు రైతులు సరి చేసుకోవాల్సి ఉంటుంది. మొబై ల్ నంబర్ ఆధార్తో లింక్ లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిపివేయబడుతుంది. ఈ విషయం లో రైతులకు మరింత అవగాహన కల్పించడానికి గ్రామస్థాయిలో అవగాహన కల్పిం చేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
రైతులకు మరింత అవగాహన..
ఇతర రాష్ట్రాల్లో మీసేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) నేరుగా గ్రామాల కు వెళ్లి నమోదు చేపడుతున్నారు. అన్ని స్థాయిల అధికారులు (ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు) ఇప్పటికే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
గ్రామ స్థాయిలో ఏఈవోలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వారి బ యోడేటాను, రైతు పేరిట ఉన్న భూమి వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరిస్తారు. ఏఈవోలు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యా ప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. నమో దు అనంతరం రైతుల మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని యాప్లో నమో దు చేస్తే వెంటనే విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య జనరేట్ అవుతుంది. ఈ ఫార్మర్ ఐడీ ఎన్రోల్మెం ట్ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, మేడ్చల్ జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఈ ఫార్మర్ ఐడీ కార్డు వల్ల కలిగే లాభాల విషయంలో రైతులకు మరింత అవగాహన క ల్పించాల్సిన అవరం ఉందని రైతు సంఘా లు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. ఈ విషయంలో రైతులకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లనే.. ఏడాదిన్నరగా సాగుతోందని చెబుతున్నారు.