కాంగ్రెస్కు మద్దతివ్వండి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీతో పీసీసీ చీఫ్,
మంత్రి పొన్నం, ఎంపీ వేం నరేందర్రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఎం పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీ కోరింది. సీపీఎం ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీతో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్(PCC President Mahesh Kumar Goud ), మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ వేం నరేందర్రెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం మహేష్కుమార్గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రె స్ పార్టీ, ఇండీ కూటమి పార్టీలతో సహా సీపీఐ, సీపీఎం కలిసికట్టుగా సర్పై చేస్తున్న ఉద్యమం తీరుపై చర్చించామని తెలిపారు.
రాష్ట్రంలోనూ సీపీఎం, సీపీఐ మద్దతుతో నడుస్తున్న తరుణంలో, వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరామన్నారు. వారు సానుకూలంగా స్పందించారని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని ఆయన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత సమావేశాన్ని శుక్రవారం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జి సెక్రటరీ సచిన్ సావంత్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్ , రాష్ట్ర గ్రంథాల సంస్థ చైర్మన్ రియాజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్ల హుస్సేన్,15 నియోజకవర్గాల ఇన్చార్జ్లు , పీసీసీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.