15న మండల సర్వసభ్య సమావేశం

13-10-2026 | 02:53pm
  1. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్ష
  2. అన్ని శాఖల అధికారులు నివేదికలతో హాజరుకావాలి: ఎంపీడీవో మహేశ్వరరావు

నాగల్‌గిద్ద, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశాన్ని(Praja Parishad General Body Meeting) ఈ నెల 15న గురువారం ఉదయం 11 గంటలకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మహేశ్వరరావు(MPDO Maheswara Rao) తెలిపారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు సమావేశ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, పెండింగ్ పనులపై సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా జలసిరి పనులు, వీబీజీ రామ్‌జీ పథకం, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్మాణం, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు.

వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై సమీక్షించనున్నట్లు తెలిపారు. మండల ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు సమావేశానికి సకాలంలో హాజరుకావాలని కోరారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీవో మహేశ్వరరావు సూచించారు.

మరిన్ని వార్తలు