మహిళా సాధికారతకు ముర్కుంజాల్‌లో కొత్త అడుగు

02-11-2026 | 07:42pm

కంగ్టి, నవంబర్ 2 (విజయక్రాంతి): గ్రామీణ మహిళల ఐక్యతకు,ఆర్థిక స్వావలంబనకు, సమగ్ర అభివృద్ధికి వేదిక కల్పించే లక్ష్యంతో కంగ్టి మండలంలోని ముర్కుంజాల్ గ్రామంలో మహిళా సమైక్య భవన(Womens Samakhya Building) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్,ఉపసర్పంచ్ విజయ్ రావు పాటిల్ భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

వి.బి.జి. రాంజీ నిధుల నుంచి భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు కావడంతో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ భవనం అందుబాటులోకి వస్తే గ్రామంలోని మహిళా సంఘాల సమావేశాలు,స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు మహిళల అభ్యున్నతికి సంబంధించిన చర్చలు,అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ సందర్భంగా సర్పంచ్ అనూష లాల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు మహిళా సమైక్య భవనం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.మహిళల ఆర్థిక స్వావలంబన,సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బంజా రమేష్, అంజయ్య మాదిగ, మీసాల లక్ష్మి, పెంటన్న, సీసీ అరుణ, వీవోఏ లీడర్లు రుక్మిణి, రమణి, లక్ష్మి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ దిగంబరావు పాటిల్, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు