ముగిసిన కుస్తీ పోటీలు
సొంత నిధులతో పోటీల నిర్వహణకు సహకరించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు, అక్టోబర్ 16: గత రెండు రోజులుగా పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) రాష్ట్ర స్థాయి అండర్ 17 బాల బాలికల కుస్తీ పోటీలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ముగిసాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన ఈ పోటీలు క్రీడాభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపాయి.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.