సమయానికి తెరుచుకుంటున్న కళాశాల గేటు
04-11-2026 | 12:02pm
విద్యార్థుల నిరీక్షణకు తెర.. అధికారుల స్పందనతో మార్పు
బెజ్జంకి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College)లో సమయపాలన పాటించకుండా ప్రధాన గేటుకు తాళం వేసి ఉంచడంతో విద్యార్థులు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితిపై విజయక్రాంతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనంపై కళాశాల సిబ్బంది, అధికారులు స్పందించారు. గతంలో ఆలస్యంగా తెరుచుకునే గేటు ప్రస్తుతం ఉదయం 8:30 గంటలకే తెరుచుకుంటుండటంతో విద్యార్థులకు ఎదురుచూపుల సమస్య తగ్గింది. విద్యార్థుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కథనానికి స్పందన రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.