‘డ్రగ్స్’లో బెజ్జ్జంకి యువకులు?

24-11-2026 | 05:30am
  1. ఆంధ్రప్రదేశ్‌లో పట్టుబడినట్లు చర్చ
  2. కొంపముంచిన సెల్ఫ్ డ్రైవింగ్ రెంట్ కారు
  3. తెలిసిన నిజానిజాలు

సిద్దిపేట, నవంబర్ 23 (విజయక్రాంతి): యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన వయసులో కొందరు మత్తు పదార్థాల(Narcotic substances) బారిన పడుతున్నారనే ఆందోళనలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో వ్యక్తమవుతున్నాయి. గంజాయి వినియోగానికి(Cannabis use) అలవాటు పడిన కొందరు యువకులు డబ్బుల కోసం అక్రమ కార్యకలాపాలకు(illegal activities) పాల్పడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పత్తి చేనుల్లోకి వెళ్లి పత్తిని దొంగిలించి విక్రయిస్తున్నారనే ప్రచారం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేసులో బెజ్జంకి యువకులున్నారా?

బెజ్జంకి మండలానికి చెందిన కొందరు యువకులు ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) నమోదైన డ్రగ్స్ రవాణా కేసులో పట్టుబడ్డారనే ప్రచారం ప్ర స్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సెల్ఫ్ డ్రైవింగ్(Self-driving) కోసం అద్దెకు తీసుకున్న కారును ఉపయోగించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే యువకులు నిజంగానే పోలీసులకు పట్టుబడ్డారా? డ్రగ్స్ సరఫరాతో(Drug supply) వారికి సం బంధం ఉందా? అనే అంశాలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

కొంపముంచిన సెల్ఫ్ డ్రైవింగ్ అద్దె కారు..

సెల్ఫ్ డ్రైవింగ్ కోసం తీసుకున్న అద్దె కారును గంజాయి సరఫరాకు వినియోగించినట్లు ప్రచారం జరుగుతోంది. వాహనం జీపీఎస్ ట్రాకింగ్లో కనిపించకపోవడంతో కారు యజమానులు పోలీసులను ఆశ్రయించారు.దాంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటకొచ్చింది.

పర్యవేక్షణ ఎక్కడ? సరఫరా మూలాలపై నిఘా ఏదీ?

గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతున్నప్పటికీ యువతకు మత్తు పదార్థాలు ఎలా చేరుతున్నాయనే ప్రశ్నలు తలె త్తుతున్నాయి. కేవలం వినియోగదారులపైనే కాకుండా సరఫరా చేస్తున్న వ్యక్తులు, నెట్వర్క్లను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవ సరం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల స్నే హాలు, అలవాట్లను గమనించడంతో పాటు విద్యాసంస్థల్లోనూ మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలి

పోలీసుల నిఘా.. కఠిన చర్యలు : ఎస్‌ఐ తోట తిరుపతి

మండలంలో గంజాయి వినియోగం, సరఫరాపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని ఎస్‌ఐ తోట తిరుపతి తెలిపారు. గంజా యి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన వారిపై చట్టప్రకారం చర్య లు తీసుకుంటున్నామని వెల్లడించారు. అవసరమైన సందర్భాల్లో బైండోవర్ చర్యలు కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందినా వెంటనే స్పందిస్తామని స్ప ష్టం చేశారు. యువత గంజాయి వంటి మ త్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు